« యాత్రీకులమ్ మనమందరం
Yathreekulam manamandharam
share with whatsapp

పల్లవి:
యాత్రీకులమ్ మనమందరం ఈ జీవయాత్రలో సాగెదమ్   
కలదు మార్గము జీవమునకు – కనుగొంటివా మరణించవెన్నడు   
అను పల్లవి:
నీలో నాలో ఉన్నది ఓ మార్గమ్ -ఆ మార్గమే కలువరి మార్గము   
తోట్రిల్లని యాత్రికులమై – సీయోను పురమును చేరెదము   
...సీయోను...
1.
ఒక నదికలదు ఆ బాట చెంతనే- ప్రవహించుచూనే జీవించును   
జల స్వరముచే ఆ నది పిలచును – యాత్రికుని దాహము తీర్చును   
...నీలో...
2.
పలుమారులు ఆ బాటను కమ్మును – ఓ చల్లని చీకటి నీడ   
వెరువకు ఓ నిజమున్నది – నీవెచ్చటో వేలుగచ్చటె ఉన్నది   
...నీలో...